మరింత క్లియర్ గా… కాస్టింగ్ కౌచ్ పై వర్మ క్లారిటీ!

-

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మామూలు హాట్ టాపిక్ కాదు! ఈ కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా, అన్ని రంగాల్లోనూ ఉన్నా… దానిపై పోరాటాలు సాగినప్పుడు, ఎవరైనా దాన్ని ఇష్యూ చేసినప్పుడు అది పూర్తిగా హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఈ విషయంలో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసి, ఈ విషయాన్ని హాట్ టాపిక్ గా మార్చింది. ఆమె బాద, ఆవేదన సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా మరోసారి ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు వర్మ!

తానుచెప్పలనుకున్న విషయం వీలైనంత సూటిగా, ఏమాత్రం సుత్తిలేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు వర్మ. ప్రయత్నించడం కాదు.. అది నా నేచర్ అని అన్నా కాదనలేని పరిస్థితి. సామాజిక విషయాలపై తనకంటూ ఏర్పరచుకున్న కొన్ని నిశ్చిత అభిప్రాయాలను ఎవరికోసమూ ఎప్పుడూ మార్చుకోను అనే సిద్ధంతంతో ముందుకు పోతున్న వర్మ… తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి డిగిన ప్రశ్నపై స్పందించారు.. ఈ భూమి మీద మనిషి ఉన్నంత వరకు కాస్టింగ్ కౌచ్ ఉంటుందని తేల్చేశారు!

ఇదే క్రమంలో క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి అనే అమ్మాయి పోరాటం చేసింది అన్న ప్రశ్నకు స్పందించిన వర్మ…. అది ఒక దశ మాత్రమే.. ఈ విషయానికి సంబందించి అనేక ఫేజ్ లు అలా వస్తూ పోతూ ఉంటాయి. అని స్పందించి, అనంతరం మరింత క్లారిటీ ఇచ్చారు వర్మ. మనిషి బేసిక్ లక్షణం పోదు.. మగాడి నుంచి మహిళకు డబ్బు కావాలి.. మహిళ నుంచి మగాడికి సెక్స్ కావాలి.. కొందరు దీన్ని వృత్తిలో భాగం అనుకుంటారు.. ఇంకొందరు తప్పైనా తప్పదనుకుంటారు, మరి కొందరు సీరియస్ గా తీసుకుంటారు.. ఎన్ని వచ్చినా ఈ ఎక్స్ ప్లాయిటేషన్ అనేది పోదు… వలవంతుడు బలహీనుడిని ఎప్పుడూ ఎక్స్ ప్లాయిటేషన్ చేస్తూనే ఉంటాడు అని వర్మ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు!

Read more RELATED
Recommended to you

Latest news