రాత్రికి రాత్రి కోటీశ్వ‌రుడైనా బేక‌రీ వర్కర్.. అదృష్టం అంటే ఇతనిదే.. !

-

 

లోకంలో కొందరు డబ్బుకోసం ఎంతగా కష్టపడినా అదృష్టం వరించదు, మరికొందరికి కష్టాలు పరీక్ష పెట్టి చివరికి అదృష్టాన్ని ఇస్తాయి.. ఇలాంటి వారిలో లాటరీ తగిలిన వ్యక్తులను చెప్పుకోవచ్చూ.. ఎక్కడో దేశం కానీ దేశంలో ఉంటూ, కష్టపడి పని చేసుకుంటూ కుంటుంబాన్ని పోషించుకుంటున్న వారిలో చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఆయా దేశాల్లో లాటరీ టికెట్ కొనడం.. ఎన్ని సార్లు లాటరీ కొంటారో, ఎంత ఆశతో ఎదురు చూస్తారో తెలియదు గానీ ఈ మధ్య కాలంలో లాటరీ తగిలి లక్కీగా చాల మంది కోటీశ్వరులు అయ్యారు.. ఇలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి ఒకరు..

ఇకపోతే కేర‌ళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన అస్సేన్ ముజిప్పురత్(47) అనే వ్యక్తి “గ‌త 28 ఏళ్లుగా యూఏఈలో ఉంటుండగా, ఇటీవ‌లె వచ్చిన కోవిడ్‌-19 సంక్షోభం వ‌ల్ల స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చాడట.. ఇక అన్ని సంవత్సరాలుగా ఉన్నా పరాయిదేశంలో సంపాదించింది ఏం లేదట.. అయితే అప్పుడప్పుడు లాటరీ కొనే అలవాటు ఉన్న ఇతనికి అదే అలవాటు కోటీశ్వరున్ని చేసింది.. ఎన్నో సార్లు లాటరీ కొన్నా అదృష్టం కలసి రాలేదని, కానీ ఇండియా వస్తూ వస్తూ ఒకలాటరీ కనుగోలు చేసి వచ్చానని అదే లాటరీని లక్ష్మీదేవి వరించిందని తెలిపారు..

 

ఇక బుధ‌వారం నిర్వహించిన‌ అబుధాబి బిగ్ టికెట్ లాట‌రీ డ్రాలో 12 మిలియ‌న్ దిర్హామ్స్‌ అంటే రూ. 24.60 కోట్లు గెలుచుకున్నానని మొద‌ట లాట‌రీ నిర్వ‌హ‌కుల నుంచి ఫోన్‌కాల్ వ‌చ్చిన‌ప్పుడు నమ్మ‌లేదు. ఎవ‌రో కావాల‌ని ఫోన్ చేసి ఆట ప‌ట్టిస్తున్నార‌నుకున్నా. ఆ త‌ర్వాత వారు పూర్తి వివ‌రాలు చెప్ప‌డంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం నా వంతైంది. అని ఆనందంగా పేర్కొన్నాడు.. కాగా ఇప్ప‌టికీ తాను ఇంతా భారీ మొత్తం గెలుచుకున్నానంటే న‌మ్మ‌లేక‌పోతున్నానంటూ ఆశ్చర్యపోతున్నాడు.. ఇక అజ్మాన్‌లోని ఓ బేక‌రీలో ప‌నిచేసే తాను మే 14న కొన్న‌ నెం. 139411 గ‌ల లాట‌రీ టికెట్ నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా తాను గెలుచుకున్న ఈ భారీ న‌గ‌దులో కొంత మొత్తం పేదవారి కోసం వినియోగిస్తాన‌ని ముజిప్పురత్ తెలిపారు…

Read more RELATED
Recommended to you

Latest news