ఆర్జీవీ ఇన్నోసెంటా.. రామ రామ‌..!

-

రామ్ గోపాల్‌వ‌ర్మ మ‌రో బాంబ్ పేలుస్తున్నాడు. ఏకంగా త‌న‌నే క‌డ్నాప్ చేశారంటూ `ఆర్జీవీ మిస్సింగ్‌` పేరుతో ఓ సినిమాకు శ్రీ‌కారం చుట్టాడు. స‌స్పెక్ట్ చేస్తున్న వారి లిస్ట్‌ని కూడా పెట్టేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా రిలీజ్ చేసిన వ‌ర్మ త‌న‌ని కిడ్నాప్ చేసింది త‌న కిడ్నాప్‌కు కార‌కులైన వారి లిస్ట్‌ని పెట్టేసి షాకిచ్చాడు.

త‌న‌ని కిడ్నాప్ చేసిన‌ట్టు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌, మెగా ఫ్యామిలీ, ఎక్స్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడితో పాటు ప‌ప్పు అని ప‌ల‌వ‌బ‌డే ఆయ‌న త‌న‌యుడిని స‌స్పెక్ట్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించాడు. దీంతో వ‌ర్మ స‌రికొత్త వివాదానికి దారి తీయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే ఇందులో వ‌ర్మ త‌న పాత్ర‌ని తానే పోషించాడు. అంతే కాకుండా త‌ను ఓ ఇన్నేసెంట్‌న‌ని చెప్ప‌డం న‌వ్వులు పూయిస్తోంది. వ‌ర్మ ఇన్నోసెంటా రామ రామ అని అంతా అవాక్క‌వుతున్నారు.

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో వ‌ర్మ చేతికి బేడీల‌తో త‌ప్పించుకు పారిపోతున్న ఖైదీగా వ‌ర్మ క‌నిపిస్తున్నాడు. చ‌ట‌ర్జీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అదిర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు పీకే పోస్ట‌ర్‌ని కూడా రిలీజ్ చేస్తాడ‌ట. ఈ సినిమాతో కీల‌క‌మైన మూడు ఫ్యామిలీల‌ని టార్గెట్ చేసిన వ‌ర్మ ఏరేంజ్‌లో ర‌చ్చ చేస్తాడో.. ఎంత‌గా వివాదాన్ని సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news