లక్ష్మీస్ ఎన్టీఆర్.. చాలెంజ్ చేసిన ఆర్జివి

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తను అనుకున్నది చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా వస్తున్న ఈ టైంలో ఆ సినిమాకు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అని ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. అప్పట్లో ఆ పోస్టర్ తో హాడావిడి చేసిన వర్మ కొద్దికాలంగా సైలెంట్ అయ్యాడు. దాదాపు ఆ సినిమా అటకెక్కేసింది అనుకున్న ఈ టైంలో మరోసారి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై సంచలన ప్రకటన చేశాడు వర్మ.

నాస్తికుడైన వర్మ ఈరోజు ఉదయం తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుని తన ట్విట్టర్ లో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కోసం ఓ మెసేజ్ పెట్టాడు. ఎన్.టి.ఆర్ అసలు చరిత్ర లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి వచ్చాకే అని.. ఆ నిజాలని తాను బయటపెడతానని. ఎన్.టి.ఆర్ జీవితం మీద వస్తున్న సినిమాలన్నిటికల్లా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మీదే ఎన్.టి.ఆర్ గారి ఆశీస్సులు ఉంటాయని. మిగతా సినిమాలకు ఛాలెంజ్ చేస్తూ చెప్పాడు వర్మ.

ఇది కేవలం లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని అనుకుంటే పొరబడినట్టేనని అన్నారు. జనవరి 24న ఈ సినిమా రిలీజ్ చేస్తానని ప్రకటించారు వర్మ. మొత్తానికి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు వర్మ పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news