బిగ్ ట్విస్ట్ ఇచ్చిన RGV..నట్టి కుమార్‌తో కలిసిపోయి వీడియో విడుదల..ఏమైందంటే?

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. మొన్నటి వరకు తిట్టిన వ్యక్తితో కలిసి తాజాగా వీడియో విడుదల చేశాడు. వివరాల్లోకెళితే..నిర్మాత నట్టికుమార్, రామ్ గోపాల్ వర్మ మధ్య గత కొంత కాలంగా వివాదం జరుగుతున్న సంగతి అందరికీ విదితమే.

చెక్ బౌన్స్ కేసులో తనకు డబ్బులివ్వాలని నట్టి కుమార్..వర్మపై కేసు పెట్టారు. ఈ క్రమంలోనే ‘డేంజరస్’ మూవీ రిలీజ్ కాకుండా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చాడు. ఇక ఈ వివాదంలోకి వర్మ..నట్టి కుమార్ కుమారుడు, కూతురులను తీసుకొచ్చి వారిపై కేసు పెట్టాడు. తన డాక్యుమెంట్ ఫోర్జరీ చేశాడంటూ ఆరోపించాడు. ఇటీవల పంజాగుట్ట పీఎస్ లో నట్టి క్రాంతి, కరుణలపై కేసు పెట్టాడు. ఇదిలా జరుగుతుండగానే తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

నట్టి కుమార్, తాను రాజీ పడినట్లు చెప్తూ వీడియో ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. తాము దూషించుకున్నదంతా తూచ్ అని చెప్పుకొచ్చాడు. ఇద్దరం స్నేహితులమని, కేసులను విత్ డ్రా చేసుకుంటామని వివరించారు. ఇది చూసి నెటిజన్లు వర్మనా మజాకా? వర్మ అంతే ఎవరికీ అర్థం కాడు..వర్మ గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘రాజకీయాలు, సినిమాల్లో శాశ్వత శత్రువులు ఉండబోరు ’ అనే క్యాప్షన్ తో వర్మ ఈ వీడియో ట్వీట్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news