తెలంగాణకు రానంటున్న రుతుపవనాలు.. మరో మూడు రోజులు ఆగాల్సిందే..

-

తెలంగాణకు మూడు రోజుల క్రితమే వస్తాయనుకున్న రుతుపవనాలు ఇప్పుడే రానంటున్నాయి. వాటి రాక మరో మూడు రోజులు ఆలస్యమయ్యేలా ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి మరో మూడు రోజుల నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. నిజానికి మూడు రోజుల ముందుగా గత నెల 29నే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకడంతో తెలంగాణలోకి కూడా ముందే వస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే, ఆ అంచనాలు తప్పాయి. దీంతో తెలంగాణలో మిశ్రమ వాతావరణం నెలకొంది.

Monsoon reaches Kerala, only fourth early onset since 2010 | Weather  News,The Indian Express

కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా ప్రజలు వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరు జల్లులు కురుస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 8న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాల్సి ఉంది. అయితే, మందగమనం కారణంగా వాటి రాక మరో రెండు రోజులు పట్టేలా ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాలంటే అంతకంటే ముందు కర్ణాటక, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడాల్సి ఉంటుందని, కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయని తెలిపింది వాతావరణశాఖ.

Read more RELATED
Recommended to you

Latest news