రాజమౌళి ని టార్గెట్ చేసిన ఆర్జీవీ ..ఆర్ ఆర్ ఆర్ గురించి ఇలా మాట్లాడాడేంటి ..?

-

సోషల్ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియా.. ప్రింట్ మీడియా ..ఇలా ఎక్కడైనా రాం గోపాల్ వర్మ సంచలన దర్శకుడే. ఆయన మాట్లాడింది సంచలనం అవుతుందా లేక సంచలనం అవడానికే మాట్లాడతాడా అన్నది ఇప్పటి వరకు ప్రతీ ఒక్కరి మైండ్ లో మెదులుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న. ఏదో ఒక విషయం పట్టుకొని తనదైన శైలిలోలో కామెంట్లు చేయడం..దాంతో రెండు రోజులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవడం గత కొన్నేళ్ళుగా ఆర్జీవీ కి బాగా అలవాటైంది.

 

చెప్పాలంటే తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడో అదే పక్క వాళ్ళ సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడేలా కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అవుతాడు. ఒక సినిమా గురించి ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఎలా ఉన్నా ఆ సినిమా మాత్రం బాగా ప్రమోట్ అవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆర్జీవీ తన కొత్త సినిమా ‘క్లైమాక్స్’ ను ఆన్‌లైన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎప్పటి లాగే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి మళ్ళీ సంచలనం సృష్ఠించాడు.

 

టాలీవుడ్ లో పక్కనవాడి సినిమా ఫ్లాప్ అయితే మిగిలిన వారందరు భలే సంబర పడతారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకడంటే మరొకడికి పడదని కుండబద్దలు కొట్టాడు. చెప్పాలంటే ఇండస్ట్రీలో జరుగుతున్నవి చూస్తుంటే ఆర్జీవీతో ఏకీభవించక తప్పదు. అంతేకాదు ఈసారి వచ్చి రాజమౌళి మీద పడ్డాడు. “రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ జనాలు రోడ్డు మీదకు అచ్చి బట్టలు విప్పి షాంపేన్ తో స్నానం చేస్తూ డ్యాన్స్ చేస్తారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇందులో వర్మ ఉద్దేశ్యం ఏంటో అని అందరు జుట్టు పీక్కుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news