నైనా గంగూలీ బోల్డ్ ఫొటోపై RGV రియాక్షన్ ఇదే..

హాట్ బ్యూటీ నైనా గంగూలీ..వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ RGV ‘‘వంగవీటి’’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ హీరోయిన్..వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసిన ఈ సుందరి..ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించింది.

వెస్ట్ బెంగాల్ కు చెందిన ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా వెరీ హాట్ అండ్ బోల్డ్ ఫొటో షేర్ చేసింది. అది చూసి నెటిజన్లు వావ్ ..సమ్మర్ ట్రీట్ ఇచ్చేసిందని అంటున్నారు.

నైనా గంగూలీ షేర్ చేసిన ఫొటోను చూసి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
మరొక రోజున మరో అవకాశంతో మెరిసిపోతానని నైనా గంగూలీ ట్వీట్ చేయగా, ఈ రోజే మెరిసిపోతున్నావ్ అని ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

వర్మ దర్శకత్వంతో తెరకెక్కిన ‘డేంజరస్’ ఫిల్మ్ లో హీరోయిన్ గా నైనా గంగూలీ నటించింది.ఇక వర్మ ట్వీట్ చూసి న నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ముందు నువ్వ న్యూక్లియర్ ఫిల్మ్ తీయి వర్మ అని ఓ నెటిజన్ సూచించాడు. ‘సిల్క్ స్మిత, జయమాలిని’ లాగానే నైనా గంగూలీ ఉందని అంటున్నారు మరి కొందరు నెటిజన్లు.