ఇప్పుడు కూడా మ్యాచింగ్ మాస్కులా?

-

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసు బాలీవుడ్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన అనుమానితురాలిగా వున్న రియా డ్ర‌గ్స్ డీల‌ర్‌ల‌తో జ‌రిపిన చాటింగ్ బ‌య‌టికి రావ‌డంతో ఈ కేసులో డ్ర‌గ్స్ అత్యంత కీల‌కంగా మారాయి. దీంతో నార్కోటిక్స్ డ్ర‌గ్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియాని గ‌త మూడు రోజులుగా విచారంచ‌డం మొద‌లుపెట్టింది. ప‌లు కీల‌క ఆధారాల్ని సేక‌రించిన ఎన్‌సీబీ అధికారులు డ్ర‌గ్స్ వాడుతున్న‌ బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు నోటీసులు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

అంతే కాకుండా ఈ కేసులో ప్ర‌ధాన అనుమానితురాలిగా వున్న రియా  డ్ర‌గ్స్‌కి సంబంధం వున్న బాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని కూడా అందించ‌న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే కేసులో రియా సోద‌రుడు షోవిక్ కూడా ఇటీవ‌లే అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. రియా, షోవిక్ ఇటీవ‌ల ఎన్‌సీబీ , సీబీఐ ముందు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి క‌ల్లోలంగా వుంటే వీరు మాత్రం మ్యాచింగ్ మాస్కుల‌తో విచార‌ణ‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టెన్ష‌న్ వాతావ‌ర‌ణంలోనే షోవిక్‌, రియా త‌మ డ్రెస్సుల‌కు మ్యాచ్ అయ్యే మాస్కుల్ని ధ‌రించి విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డంతో ఈ ఫొటోల్ని గ‌మ‌నించిన వారంతా ఇప్పుడు కూడా మ్యాచింగ్ మాస్కులా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news