ప్రేమ కోసం దేనికయినా రెడీ, అరెస్ట్ అవుతా : రియా

-

అనేక మలుపులు తిరుగుతున్న సుశాంత్ సింగ్ మృతి కేసులో ఇప్పుడు డ్రగ్స్‌ కోణం బయట పడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ విచారఠణ చేపట్టిన తర్వాత తర్వాత డ్రగ్స్‌ అంశం బయట పడింది. దీంతో నార్కోటిక్స్‌ కంట్రోలో బ్యూరో రంగలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. రెండు రోజుల పాటు రియా నివాసంలోనూ, సుశాంత్ హౌస్ కీపింగ్ మేనేజర్ శామ్యూల్ మిరిండా నివాసంలోనూ విస్తృత సోదాలు చేయగా పలు కీలక విషయాలు బయట పడ్డాయి.

అయితే రియా అరెస్ట్ కావడానికి రెడీగా ఉందని, ప్రేమ కోసం దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పిందని రియా లాయర్ పేర్కొన్నారు. ఆమె ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే ఎటువంటి బెయిల్ కోసం కూడా అప్ల్లై చేయలేదని అన్నారు. ఇక పరిస్థితులను బట్టి చూస్తే ఆమె ఈ సాయంత్రం అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news