అభిమాని కాళ్ళు మొక్కిన స్టార్ హీరో..నెటిజన్లు ఫిదా..

-

సినీ స్టార్స్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.. వారికున్న క్రేజ్ తో అభిమానులు పెరుగుతారు..వారి సినిమాలె కాదు..అభిమాన హీరోల కోసం ఎన్నెన్నో చేస్తారు. సినిమాలకు మాత్రమే కాదు బయట కూడా అలానే ఉంటారు..ఇప్పుడు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతూంది..కొన్ని సార్లు స్టేజ్ పైన తమ అభిమాన హీరో మాట్లాడుతుంటే అక్కడికి దూసుకు వచ్చి ఆ హీరోల కాళ్ళ మీద పడుతూ ఉంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. అయితే కొన్ని సార్లు రివర్స్ లో ఆ స్టార్ హీరోలే అభిమానుల కాళ్లు పట్టుకుంటుంటారు..

తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఆ మధ్య ఓ అభిమాని తన కాళ్లకు నమస్కరిస్తుంటే వెంటనే ఆయన కూడా అభిమాని కాళ్లకు నమస్కరించాడు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ కూడా అదే చేశాడు. తాజాగా మరో హీరో కూడా అభిమాని కాళ్లు పట్టుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. మాములుగా బాలీవుడ్లో అభిమానులు వచ్చి మీద పడుతుంటే ఆ హీరోలు సీరియస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

కాగా, ఓ లేడీ ఫ్యాన్ కాళ్లు పట్టుకున్నాడు హీరో రితేష్ దేశ్ ముఖ్. తొలిసారి మరాఠీలో `వేద్` మూవీలో నటిస్తూ తానే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు రితేష్. ఈ మన మజిలీ సినిమా కు ఇది రీమేక్. జెనీలియా హీరోయిన్ గా నటిస్తుంది.

చాలా కాలాం తర్వాత ఇలా భార్యాభర్తలు కలిసి నటిస్తున్నారు. డిసెంబర్ 30న భారీ స్థాయిలో ఈ ను రిలీజ్ చేస్తున్నారు. ఈసందర్భంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా..ఓ కాలేజీ క్యాంపస్ కు వెళ్లారు చిత్రయూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్ పైకి వచ్చి రితేష్ తో కలిసి డాన్స్ చేయాలనీ ఉందని కోరింది. వెంటనే రితేష్ ఆమెతో కలిసి డాన్స్ చేశాడు. దాంతో ఆమె ఆనందం ఆపుకోలేక బోరున ఏడుస్తూ.. అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు పట్టుకున్నాడు. రితేష్ ప్రవర్తనకు అక్కడ ఉన్నవారంతా ఫిదా అయ్యారు. ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది..గ్రేట్ కదా..

Read more RELATED
Recommended to you

Latest news