యూట్యూబ్ ని షేక్ చేసిన రౌడీ బేబీ.. రికార్డులు బద్దలు.

తమిళ నటుడు ధనుష్ నటించిన మారి 2 చిత్రంలోని రౌడీ బేబీ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాట అందరినీ ఉర్రూతలూగించింది. 2018లో విడుదలైన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా రౌడీ బేబీ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ట్యూన్ కి తోడు సాయి పల్లవి, ధనుష్ ల డాన్స్ కూడా బాగా అలరించింది.

ఐతే రౌడీ బేబీ పాట వన్ బిలియన్ వ్యూస్ అందుకున్న ఈ రోజే ధనుష్ పాడిన కొలవెరి డీ పాట తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మేరకు ధనుష్ ట్విట్టర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసాడు. ఒకే రోజున రెండు పండగలు వచ్చినంత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అటు సాయి పల్లవి కూడా తను నటించిన సినిమాలోని పాట వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరిచింది.