రికార్డులను తొక్కుకుంటు పోతున్న RRR..నాలుగు వారాల్లో అన్ని కోట్ల కలెక్షన్స్

-

మాస్టర్ స్టోరి టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన RRR గత నెల 25న విడుదలైంది. విజ్యువల్ వండర్ అయిన ఈ ఫిల్మ్ చూసి దేశమే కాదు ప్రపంచం కూడా ఫిదా అయింది. రామ్ చరణ్, తారక్ ల పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రంలో వీరిరువురు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు.

ఇండియన్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్ధలు కొట్టుకుంటూ ఈ చిత్రం ఇంకా దూసుకుపోతున్నది. రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ పిక్చర్ ఓవర్సీస్‌లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్‌లో రూ. 300 కోట్లను అతి తక్కువ టైంలోనే వసూలు చేసింది.

ఈ చిత్రం నాలుగు వారాల కలెక్షన్లను శుక్రవారం మూవీ యూనిట్ తెలిపింది. మొత్తంగా ఇప్పటి వరకు RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్లకుపైగా వసూలు చేసింది ఈ సినిమా. ఈ చిత్ర షేర్ రూ.600 కోట్లకు పరిమితమైంది. మన దేశంలో మాత్రమే రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా RRR నిలిచింది.

బాహుబలి తర్వాత రెండోస్థానంలో ఈ సినిమా ఉంది. అయితే, ఈ చిత్ర షేర్ మాత్రం రూ.600 కోట్ల వద్దే ఉంది. ఐదో వారంలోకి ఈ చిత్రం ఎంటర్ అవుతున్న క్రమంలో KGF2 ఎఫెక్ట్ పడింది. మెగాస్టార్ చిరు ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ పిక్చర్ రిలీజ్ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో RRR కలెక్షన్స్ క్లోజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని అంచనా. ‘ఆచార్య’ పిక్చర్ లో చిరంజీవి- రామ్ చరణ్ కలిసి నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news