గుర్రంపై కొమరం భీం, ఆర్ఆర్ఆర్ లుక్ దుమ్మురేపింది…!

-

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. తెలంగాణా వీరుడిగా పేరున్న కొమరం భీం, ఆంధ్రప్రదేశ్ వీరుడిగా పేరున్న అల్లూరి సీతారామరాజులను ఒక చోట కలిపి ఊహాజనితంగా తీస్తున్న సినిమా ఇది. 

ఈ సినిమాలో కొమరం భీం గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. శ్రేయా, అజయ్ దేవగన్ ల మధ్య సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఉండగా మూడో హీరోయిన్ గా శ్రేయా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ కి సంబంధించి ఒక పోస్టర్ బయటకు వచ్చింది.

ఫ్యాన్ మేడ్ పోస్టర్ గా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఈ పోస్టర్ లో కొమరం భీం పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గుర్రంపై కూర్చుని యుద్దానికి సిద్దం అంటూ తలకు పాగా పెట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని తెల్ల పంచెలో వీరుడిగా కనపడుతున్నాడు. వెనుక మబ్బులు ఉన్నాయి. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల చెట్టుకి తుపాకి ఆనించి ఉండగా పులి ఒక కన్నుతో కోపంగా చూస్తున్న పోస్టర్ హల్చల్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news