RRR క్రేజీ రికార్డు.. ఇండియాలోనే 5వ సినిమాగా చరిత్ర

-

మన తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటుతోంది ‘ ఆర్ఆర్ఆర్’ మూవీ. మార్చి 25న ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలైన ట్రిపుల్ ఆర్ అన్ని భాషల్లో కూడా సంచలన క్రియేట్ చేస్తోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది.

బాహుబలి తర్వాత వస్తున్న రాజమౌళి సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ పై మొదటి నుంచి భారీ హైప్ నెలకొంది. మరోవైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.దీంతో అదే స్థాయిలో రికార్డులను కొల్లగొడుతోంది. అయితే.. తాజాగా మరో రికార్డు క్రియేట్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్.

అత్యధిక కలెక్షన్స్‌ చేసిన ఇండియన్‌ సినిమాల్లో 5 వ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది ఆర్‌ఆర్‌ఆర్‌. మొదటి స్థానంలో దంగల్, రెండో స్థానంలో బాహుబలి2, మూడో స్థానంలో బజరంగీ భాయిజాన్, నాలుగో స్థానంలో SecretSuperstar ఉంది. తాజాగా పీకే రికార్డును బ్రేక్‌ చేసి RRR మూవీ 5వ స్థానంలో నిలిచింది. ఇక ఇప్పటి వరకు రూ.800 కోట్లు వసూలు చేసింది ఆర్ఆర్‌ఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news