ఇది నిజమేనా.. ఇంకా కలలాగే అనిపిస్తోంది : ఎస్‌.ఎస్‌.రాజమౌళి

-

హాలీవుడ్ గడ్డపై తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇంగ్లీష్ సినిమా పాటలను వెనక్కి తోసేసి.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను ఆస్కార్ వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్​లోని డాల్బీ థియేటర్​లో జరిగిన ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటుకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఆ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్పందించారు. అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘నిజంగా ఇది కలలాగానే ఉందని.. అయితే, అవార్డు వస్తుందని నమ్మకంతో ఉన్నామని చెప్పారు.

‘మీ జీవితంలో అత్యంత అమూల్య క్షణం మీ సినిమా అవార్డును గెలుచుకోవడమా? లేక ఆస్కార్‌ వేదికపై మీ సినిమాలోని పాటను ప్రదర్శించడమా అని అడిగితే, ఎంపిక చేసుకోవడం నిజంగా నాకు కష్టమే. రెండింటినీ చూడటం ఎంతో సంతోషంగా ఉంది. సాంగ్‌ ప్రదర్శించినంత సేపు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, పూర్తయ్యాక స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం చూస్తే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నన్ను నిలబెట్టినట్లు ఉంది. అలాగే ఆస్కార్‌ అవార్డు ఆయన్ను (కీరవాణి) శిఖరాగ్రాన నిలబెట్టింది’’’ అని రాజమౌళి తెగ ఆనందపడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news