‘ఆర్ఆర్ఆర్’ కొమురం భీమ్ అఫీషియల్ లుక్ అదిరిందిగా.. ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే..

-

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న బాహుబ‌లి సినిమా రికార్డుల‌ని తానే చెరిపేందుకు గ‌ట్టిగా కృషి చేస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విశాఖ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్, తెలంగాణ ఉద్యమ వీరుడు కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతున్న దృశ్యాలు ఆన్ లైన్ లో లీక్ కావడంతో, అప్రమత్తమైన యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.

అయితే జూలై 30,2020న విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుంది. ఎన్టీఆర్‌పై కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వేళ, ఆయన లుక్, వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అయింది. దీంతో ఎన్టీఆర్ అఫీషియల్ లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. తలపాగా, గడ్డంతో సీరియస్ గా చూస్తున్నట్టు ఉన్న ఎన్టీఆర్ లుక్ మరింత వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news