తగ్గేదేలే.. టాకీసులోనే పంతులు గారి ‘నాటు నాటు’ స్టెప్పులు.. RRR క్రేజ్ అదుర్స్..

దర్శకులు రాజమౌళి ఇండియా గర్వించే గొప్ప దర్శకుడన్న ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూసి సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిని అభినందిస్తున్నారు. RRR ఫిల్మ్ విడుదలై వన్ వీక్ దాటుతున్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఈ మూవీని విశేషంగా ఆదరిస్తున్నారు.

ఈ క్రమంలోనే థియేటర్స్ లోనే సినిమాను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. టాకీసులన్నీ జనంతో కిట కిట లాడుతున్నాయి. అరుపులు, గోలల మధ్య సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణల పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాగా, ఓ అభిమాని చేసిన డ్యాన్స్ వీడియో ప్రజెంట్ నెట్టింట బాగా వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రదర్శితమవుతున్న టైంలో వచ్చిన ‘నాటు నాటు’ సాంగ్ చూసిన పంతులుగారు తగ్గేదేలే అనుకున్నారు.

టాకీసులోనే ఇరగదీశారు సదరు పంతులు గారు. ఓ వైపు ప్రేక్షకులు కేరింతలు కొడుతుండగా, మరో వైపున ఆయన థియేటర్ స్టెప్స్ మధ్యలోకి వచ్చి ‘నాటునాటు’స్టెప్స్ వేశారు. ఆ స్టెప్స్ చూసి జనాలు సంతోషపడ్డారు. వేరే లెవల్ లో పంతులు గారు స్టెప్పులేస్తున్నారని అంటున్నారు.

ఆ వీడియో రికార్డు చేసి ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా అది నెట్టింట వైరలవుతోంది. ఏపీలోని తిరుపతి ఎస్వీ సినీ ప్లెక్స్ డాల్బీ అట్మాస్ డీఆర్ మహల్ లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ వారు తమ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో ఈ వీడియో షేర్ చేశారు. అది చూసి మెగా, నందమూరి అభిమానులు ఆనందపడుతున్నారు.