ఈ విషయంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని మెచ్చుకోవాల్సిందే..

ఏదైనా పండగ వచ్చిందంటే చాలు కొత్తగా తెరకెక్కుతున్న సినిమాల నుండి అప్డేట్లు వచ్చేస్తుంటాయి. అభిమానులు కూడా తమ హీరో సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ రావాలని కోరుకుంటారు. కొత్త సినిమా ప్రారంభమో, ఆల్రెడీ రూపొందుతున్న సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో తెలియజేయడమో, పాట, మాట.. ఇలా ఏదైనా ఒకటి రివీల్ చేసి అభిమానులని ఆనందపరుస్తారు. ప్రస్తుతం దీపావళి వచ్చేసింది. ఈ నేపథ్యంలో చాలా సినిమాల నుండి కొత్త కొత్త అప్డేట్లు రాబోతున్నాయి.

అందువల్ల ఆర్ ఆర్ ఆర్ నుండి కూడా ఏదైనా అప్డేట్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోరుకుని ఊరికే ఊరుకోకుండా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ కి తెలియజేస్తున్నారు. అభిమానుల కోరికకి స్పందించిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఏదైనా అప్దేట్ ఇద్దామా అని ఆలోచిస్తున్నట్టు ట్వీట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాధారణంగా అభిమానులు ఇలాంటి కోరికలు కోరుతూనే ఉంటారని, వాటి గురించి టైమ్ వచ్చినప్పుడే చెబుదామని భావించి, సోషల్ మీడియాలో అడగ్గానే రిప్లై ఇవ్వరు. కానీ ఆర్ ఆర్ అర్ టీమ్ వాటికి భిన్నంగా అభిమానులు అడిగిన వాటిని తీర్చడానికి ముందుకు వస్తుంది. అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న ఆర్ ఆర్ టీమ్ ని అభినందించాల్సిందే.