దేశ వ్యాప్తంగా కరోనా రెండో వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమవుతుంది. ఇప్పుడు కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. వస్తుంది చలికాలం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై రాష్ట్రాలతో చర్చిస్తుంది. ఈ నేపధ్యంలో ఈ నెల చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ… రాష్ట్రాల సిఎంలతో సమావేశం నిర్వహిస్తారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాల సిఎంలతో ఆయన మాట్లాడతారు. హిమాలయాల రాష్ట్రాలతో ముందు మోడీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సిఎంలతో ఆయన సమావేశం కానున్నారు. వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ పై కూడా చర్చిస్తారు.