ఏ ముహుర్తాన ఆరెక్స్ 100 సినిమా చేసిందో కాని ఆ ఒక్క సినిమాతో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. కొన్నాళ్లుగా హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్న భామలకు కూడా రాని హాట్ ఇమేజ్ అమ్మడి సొంతం అయ్యింది. ఆరెక్స్ 100 తర్వాత అలాంటి ఆఫర్లే వస్తున్నాయంటూ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ఓ లక్కీ ఆఫర్ సొంతం చేసుకుంది.
క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. సినిమాలో జయసుధ పాత్రలో పాయల్ కనిపించనుందట. ఇప్పటికే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో విద్యా బాలన్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటిస్తుండగా లేటెస్ట్ గా పాయల్ రాజ్ పుత్ కూడా ఈ సినిమాకు సెలెక్ట్ అయ్యింది. ఎన్.టి.ఆర్, జయసుధ ఎన్నో సినిమాల్లో నటించారు. వాటికి సంబందించిన సీన్స్ లో జయసుధగా పాయల్ కనిపించి అలరిస్తుందట.