అక్కడ పెళ్లిళ్లలో చేపలను కానుకలుగా ఇస్తారు..!

-

షాకయ్యారా? నోరెళ్లబెట్టారా? చేపలను ఏం చేసుకోవాలి.. కూరొండుకొని తినాలా? అవి వాసన రావా? అంటూ ఇలా మీకు సవాలక్ష డౌట్లు వచ్చుంటాయి. అక్కడ అంతే.. చేపలను మంచిగా అంకరించి మరీ.. వాటిని బహుమతిగా ఇస్తుంటారు. ఎందుకిలా అంటే అది మా సంప్రదాయం అంటారు.. ఎక్కడండీ ఈ వింత సంప్రదాయం అంటారా? రండి.. ఓసారి వెస్ట్ బెంగాళ్ వెళ్లొద్దాం.

ఓసోస్.. వెస్ట్ బెంగాళా? అక్కడ జనాలను చేపలంటే పిచ్చికదా. చేపలను తెగ తినేస్తుంటారు. కానీ.. ఇలా వాటిని బహుమతిగా కూడా ఇస్తారా? అని అంటారా? అవును.. మీరు చెప్పేది కరెక్టే. వాళ్లు చేపలను కేవలం తినడానికే కాదు… వాళ సంప్రదాయంలో భాగంగా చూస్తారు. అందుకే పెళ్లిళ్లలో చేపలను సూపర్బ్ గా అలంకరించి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు కానుకగా అందజేస్తుంటారు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటోలు అవే.

అంతే కాదు.. పెళ్లి ముందు పెళ్లింట్లో చేపలతో వంటకాలు అదిరిపోతాయట. దాన్నే ఐబురో బాత్ అని పిలుస్తారు. పెళ్లి చేసుకోబోయే వరుడు.. పెళ్లి కూతురుకు.. చేపను గిప్ట్ గా ఇస్తాడట. ఆ చేపను అచ్చం పెళ్లి కూతురుగా అలంకరిస్తారట. అదే అక్కడ స్పెషల్. పెళ్లికి వచ్చే అతిథులు కూడా చేపలను డెకరేట్ చేసుకొని బుట్టలో తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తారట. ఇలా.. ఒక్క తిండిలోనే కాదు.. అన్నింట్లో చేపలు వాళ్ల సంప్రదాయంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news