‘ సాహో ‘ ఫ‌స్ట్ డే టార్గెట్ ఎంతంటే…


బాహుబలి హీరో నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో రిలీజ్ కు రంగం సిద్ధం అయ్యింది. సాహో థియేటర్లలోకి వచ్చేందుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దాదాపుగా నెల రోజులుగా థియేటర్లలో సరైన సినిమా లేక ఆకలితో అలమటిస్తున్న సినిమా ప్రియులను సాహో ఎంతగానో ఊరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని సింగిల్ థియేటర్ లతోపాటు మల్టీప్లెక్స్‌ల‌లో సాహోను ప్రదర్శిస్తున్నారు. ఒక రోజు ముందుగానే గురువారం అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

దీంతో పాటు అదనపు షోలు… ప్రీమియర్ల‌కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి పొందేందుకు సాహో మేక‌ర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికే ఆ దిశగా స‌క్సెస్ అయిన‌ట్టు కూడా తెలుస్తోంది. సినిమాకు ఉన్న‌ హైప్ తో పాటు ఈ హంగామాతో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. బాహుబలి వన్ ఫస్ట్ డే ఓపెనింగ్ అద్భుతం ఏమీకాదు. కానీ బాహుబలి 2 ఓపెనింగ్ మాత్రం అద్భుతమే, వరల్డ్ వైడ్ గా దాదాపు 120 కోట్ల మేరకు వసూలు చేసింది.

అయితే బాహుబ‌లి రేంజ్ వేరు… దాని క్రేజ్ వేరు. బాహుబ‌లి వ‌న్ త‌ర్వాత వ‌చ్చిన అంతులేని హైప్‌తో బాహుబ‌లి 2 వ‌చ్చింది. సాహోకు హిట్ టాక్ వ‌స్తే బాహుబలి 2 రికార్డు సుమారు 43 కోట్లు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. అయితే సినిమాకు వ‌చ్చే టాక్ కూడా ఇంపార్టెంటే. అయితే బాహుబ‌లి 2 టోట‌ల్ రికార్డు దాట‌డం మాత్రం క‌ష్ట‌మే.

అయితే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో, అలాగే హిందీ వెర్షన్ ఏ మేరకు వసూలు చేస్తుందో ? అన్న దానిపైనే టోట‌ల్ బాహుబ‌లి 2 ఫ‌స్ట్ డే టార్గెట్ క్రాస్ చేయ‌డం అన్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంది. బాహుబ‌లి 2 నార్త్‌లో ఫ‌స్ట్ డే ఏకంగా రూ.40 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఓవ‌రాల్‌గా రూ.120 కోట్లు కొల్ల‌గొట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. కానీ మేక‌ర్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లు కొట్టేస్తామ‌న్న ధీమాతో ఉన్నారు. మ‌రి సాహో ఏం చేస్తుందో ?  చూడాలి.