ఒళ్లు గ‌గుర్పొడిచే సీన్ల‌తో అదిరిపోయిన‌ సాహో టీజ‌ర్..!

-

సాహో సినిమా టీజ‌ర్ కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తుండ‌గా.. ఈ రోజు ఆ టీజ‌ర్ విడుద‌ల‌తో వారు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

యువీ క్రియేష‌న్స్ నిర్మాణంలో న‌టుడు ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం సాహో. బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే అభిమానులంతా సాహో మూవీ ఎప్పుడు విడుద‌ల‌వుతుందా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ ఆ సినిమా టీజర్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ అభిమానుల‌కు తీపి క‌బురు కూడా చెప్పింది. ఈ సినిమాను ఆగ‌స్టు 15వ తేదీన విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సాహో చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ జ‌న‌ర్స్‌ల‌లో మూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని మ‌న‌కు టీజ‌ర్‌ను చూస్తే తెలుస్తుంది. అటు ప్ర‌భాస్ అభిమానులనే కాదు, ఇటు తెలుగు సినీ అభిమానుల కూడా సాహో ఎంతో ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది. చిత్రంలో ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉన్న యాక్ష‌న్ స‌న్నివేశాలు, హీరో ప్ర‌భాస్ డైలాగ్‌లకు.. ప్రేక్ష‌కులు కొట్టే ఈల‌లు, అరిచే అరుపులు, చ‌ప్ప‌ట్ల‌తో థియేట‌ర్లు మారుమోగి పోతాయ‌ని టీజ‌ర్‌ను చూస్తే మ‌న‌కు అర్థమ‌వుతుంది.

సాహో సినిమా టీజ‌ర్ కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి వేచి చూస్తుండ‌గా.. ఈ రోజు ఆ టీజ‌ర్ విడుద‌ల‌తో వారు సంబ‌రాలు చేసుకుంటున్నారు. టీజర్ విడుద‌లైన కొద్ది సేప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది దాన్ని చూశారంటే సినీ ప్రేక్ష‌కుల్లో సాహో క్రేజ్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, వీడియోలు కూడా ఈ సినిమాపై అభిమానుల్లో అంచ‌నాల‌ను భారీగా పెంచేశాయి. కాగా టీజ‌ర్‌లో ప్ర‌భాస్ న‌టించిన ప‌లు యాక్ష‌న్ స‌న్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమా ఆద్యంతం యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు కొదువ ఉండ‌ద‌ని మ‌న‌కు టీజ‌ర్ చూస్తే తెలుస్తుంది. అలాగే శ్ర‌ద్ధా క‌పూర్‌, ప్ర‌భాస్ ల మ‌ధ్య న‌డిచే ల‌వ్ ట్రాక్‌, రొమాంటిక్ సీన్లు, విలన్ల‌తో ప్ర‌భాస్ చేసే పోరాటం తాలూకు దృశ్యాలు హాలీవుడ్ సినిమాల స్థాయిని త‌ల‌పిస్తున్నాయి.

సాహో చిత్రాన్ని వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మిస్తుండ‌గా, ఇందులో నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, ఎవ్‌లిన్ శ‌ర్మ‌, జాకీష్రాఫ్‌, చుంకీ పాండే త‌దిత‌ర ప్ర‌ముఖ న‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే ప‌లువురు హాలీవుడ్ టెక్నిషియ‌న్లు కూడా ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ళ‌యాళంతోపాటు ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ ఒకేసారి సాహో మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. కాగా ఈ చిత్రానికి శంక‌ర్‌, ఎహ్‌సాన్‌, లాయ్‌లు సంగీతాన్ని అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version