పేరు మార్చుకుంటే ఫేట్ మారుతుందా..!

మెగా హీరో చిరంజీవి మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ మొదట్లోనే క్రేజీ హిట్లు అందుకున్నాడు. మేనళ్లుడుగా మెగా మేనరిజం చూపిస్తూ మెగా ఫ్యాన్స్ లో మంచి ఫాల్యింగ్ తెచ్చుకున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు డబుల్ యాట్రిక్ ఫ్లాపులు చవిచూసిన సాయి ధరం తేజ్ కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రళరి సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ ఈ సినిమా నుండి తన పేరుని సాయి తేజ్ గా మార్చుకున్నట్టు తెలుస్తుంది.

సినిమాలో పరుగు పరుగు అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజైంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ క్యాచీగా ఉంది. ఇక ఈ సాంగ్ వీడియోలో సాయి ధరం తేజ్ కు బదులుగా సాయి తేజ్ అని పెట్టారు. అంటే పేరు మార్చుకుంటే అన్నా లక్ కలిసి వస్తుందని భావించి ఉంటాడు అందుకే తేజూ సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా మార్చేశాడు. నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.