అక్కినేని హీరో.. కియరాపై కన్నేశాడు..!

అక్కినేని అఖిల్ 4వ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ తో దాదాపు కన్ఫాం అయినట్టే. అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా ఆద్వానిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే క్రేజీ ఛాన్సులు అందుకుంటున్న కియరా తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలు చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ అర్జున్ రెడ్డిలో హీరోయిన్ గా నటిస్తున్న కియరా అద్వాని లస్ట్ స్టోరీస్ తో రచ్చ చేసిన విషయం తెలిసిందే. అందం అభినయం రెండిటిలో అదరగొడుతున్న కియరాతో రొమాన్స్ చేసేందుకు స్టార్స్ క్యూ కడుతున్నారు. మహేష్, చరణ్ ల తర్వాత అఖిల్ అక్కినేనితో కియరా రొమాన్స్ చేస్తుందని తెలుస్తుంది. ఈమధ్య ఫోటో షూట్స్ తో అదరగొడుతున్న అమ్మడికి ఇది మరో లక్కీ ఛాన్స్ అన్నట్టే.