సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై..షాక్ లో ఫ్యాన్స్ !

-

సాయి పల్లవి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

న్యాచురాలిటీగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మరింత మెప్పించింది. విల్లులా తన శరీరాన్ని వంచుతూ మరింతగా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఓ కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి డాక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే. కోయంబత్తూర్ లో సొంతంగా ఒక హాస్పిటల్ ను నిర్మిస్తోందని, ఈ హాస్పిటల్ ను ఆమె చెల్లెలు పూజ కలిసి చూసుకోబోతున్నారని, అందుకే సినిమాలను వదిలేయాలని అనుకుంటున్నాట్లుగా టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news