సాయి పల్లవి – కృతి శెట్టి.. ఇద్దరిలో ఎవరు బెస్ట్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇతర భాషా ఇండస్ట్రీల హీరోయిన్ ల హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు తమిళ్ హీరోయిన్లు దూసుకుపోతుంటే ఇంకొక వైపు కన్నడ హీరోయిన్లు మేమేం తక్కువ కాదంటూ పోటీ పడుతున్నారు.. ఇక ఈ క్రమంలోనే బాగా ట్రెండ్ ఫాలో అవుతూ ప్రేక్షకులను మైమరిపిస్తున్న ముద్దుగుమ్మలలో సాయి పల్లవి, కృతి శెట్టి కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం వీరిద్దరి అభిమానులలో డిబేట్ నడుస్తోంది .ఇక అంతేకాదు కొంతమంది అభిమానులు సాయి పల్లవి గ్రేట్ అంటే మరి కొంతమంది అభిమానులు కృతి శెట్టి గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.. ఇకపోతే వీరిద్దరిలో ఎవరు బెస్ట్? అభిమానుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

 

అయితే శేఖర్ కమ్మలు దర్శకత్వంలో ఫిదా సినిమా ద్వారా మెగా వారసుడు వరుణ్ తేజ్ సరసన నటించి ప్రేక్షకులను మైమరిపింప చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే సాయి పల్లవి నటించిన ఏ సినిమా కూడా డిజాస్టర్ కాలేదని చెప్పాలి. కానీ ఇటీవల ఆమె నటించిన విరాటపర్వం సినిమాతో మాత్రం కొంతవరకు విమర్శలను ఎదుర్కొంది సాయి పల్లవి. సాయి పల్లవి నిర్మాతల వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు. పారితోషకం విషయంలో ఈమె ఏ మాత్రం డిమాండ్ చేయదు. నిర్మాతలకు అనుగుణంగా నిర్మాతలు ఎంత చెబితే అంతా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. చాలామంది దర్శకనిర్మాతలు సాయి పల్లవి తో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈమెతో సినిమా తీస్తే ఖర్చు పెద్దగా ఉండదు పైగా లాభాలు ఎక్కువగా ఉంటాయన్న ఆలోచనతోనే ఈమెతో సినిమాలు చేయడం గమనార్హం. నాచురల్ బ్యూటీగా, బెస్ట్ డాన్స్ పెర్ఫార్మర్ గా, మంచి మానవత్వం ఉన్న అమ్మాయిగా సాయి పల్లవి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక కృతి శెట్టి కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ సరసన ఉప్పెన సినిమాతో.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.. బంగార్రాజు సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. చూడడానికి చాలా ముద్దుగా కనిపించే ఈ అమ్మాయి కూడా లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల జరిగిన ఓటింగ్ పోల్ లో సాయి పల్లవి, కృతి శెట్టి ఎవరు బెస్ట్ అంటే చాలామంది సాయి పల్లవికి ఓటు వేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news