మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మమతా బెనర్జీ

-

దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న మీడియా మిత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమానికి హాజరైన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్ శర్మ బీజేపీ బహిష్కరణ, కేంద్ర హోంశాఖ మంత్రి జై షాను బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా నియమించడం వంటి వివాదాస్పద అంశాలపై ఆమె మాట్లాడారు.

సీఎం మమతా బెనర్జీ
సీఎం మమతా బెనర్జీ

2024లో జరిగే ఎన్నికలు పాలకులను ఎన్నుకునేందుకు కాకుండా.. బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించేందుకు ఎన్నికలు జరుగుతాయని మమతా బెనర్జీ అన్నారు. మహారాష్ట్రలో ఏర్పడిన బీజేపీ అధికార కూటమి మరో ఆరు నెలల్లో కూలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో ఏర్పడిన కూటమి తర్వలోనే నేలమట్టం కావడం ఖాయమన్నారు. మహారాష్ట్రలో బీజేపీది అనైతిక, అప్రజాస్వామిక ప్రభుత్వమన్నారు. కావాలని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ.. ప్రజల హృదయాలను ఎప్పటికీ గెలవలేరని దీదీ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news