Salaar OTT : సలార్ ఓటీటీ విడుదల తేది ఖరారు..ఎందులో వస్తుందంటే ?

-

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్ ప్రభాస్ అభిమానులను చాలా ఏళ్ళ తరువాత కాలర్ ఎగరేసేలా చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్ : సీజ్ ఫైర్’ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.

ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో చూపించారు. ఇక ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. ‘సలార్ : సీజ్ ఫైర్’ సినిమాను థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్ ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని టాక్ వినిపించింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news