సెన్సేషనల్ రికార్డు సృష్టించిన సలార్ టీజర్..!

-

ప్రముఖ కేజీఎఫ్ మూవీల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న చిత్రం సలార్.. బాహుబలి తో బాక్సాఫీస్ రికార్డులు కొల్ల కొట్టిన ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలు కలెక్షన్ల పరంగా ఓకే అనిపించాయి. కానీ సినిమాలు మాత్రం విజయవంతం కాలేదు. ఇక ఆయన అభిమానులు కూడా ఊహించని సినిమాలను చెప్పవచ్చు.. ఇలాంటి నేపథ్యంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం సలార్.. సెప్టెంబర్ 28వ తేదీన విడుదలకు సిద్ధం కానున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెట్టుకున్నారు అభిమానులు.

అందుకు కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు. కేజిఎఫ్ సిరీస్ లతో పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ రికార్డులను బ్రేక్ చేసిన ఈయన ఇప్పుడు సలార్ చేస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఉండగా తాజాగా నిన్న ఉదయం సలార్ టీజర్ ను విడుదల చేయగా 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ను దక్కించుకోగా 1. 67 లైక్స్ వ్యూస్ ని కూడా రాబట్టింది.

ఇకపోతే విడుదలైన మొదటి రోజులో ఈ రేంజ్ లో వ్యూస్ రాబట్టడం ఒక అరుదైన రికార్డనే చెప్పాలి. ఇకపోతే వ్యూస్ పరంగా తర్వాతి స్థానంలో ఆది పురుష్ నిలవగా మూడవ స్థానంలో కేజీఎఫ్ 2 నిలిచింది. ఇక పోతే నాలుగవ స్థానంలో రాధేశ్యామ్ నిలిచింది. విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా పాజిటివ్ బజ్ వచ్చి ఉండి ఉంటే ఈ నెంబర్ ఇంకా పెరిగేది. ఇకపోతే సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఈ సినిమాలో ఇంకా ఏదైనా మార్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news