సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. అంగన్‌వాడీ చిన్నారులకూ ప్రత్యేక కిట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది జగన్ సర్కార్. విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పథకంలో యూనిఫామ్, బూట్లు, బ్యాగ్, బుక్స్ లాంటివి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పిల్లలకు కూడా ప్రత్యేక కిట్లు అందించనుంది. 3-6 ఏళ్ల చిన్నారులకు ఒక పలక, 12 రంగుల స్కెచ్ పెన్సిళ్లు, రెండు పెన్సిళ్లు, ఒక ఎరేజర్, షార్ప్నర్ తో కూడిన కిట్లను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయనుంది. దాదాపు 8.50 లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది.
కాగా, ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తిరుమలలో 800 కిలోవాట్ల పవన్ విద్యుత్ టర్బైన్ ను ఉచితంగా ఏర్పాటు చేయనుంది. దీనివల్ల ఏడాదికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఏటా రూ. 90 లక్షల మేర విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని TTD అధికారులు తెలిపారు. తిరుమలలో ఏటా 4.5 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనిలో కోటి యూనిట్లు తిరుమలలో ఉన్న పవన విద్యుత్ ద్వారా సమకూరుతోంది.