సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి దగ్గరైన కత్రీనా కైఫ్

Join Our Community
follow manalokam on social media

సల్మాన్‌ ఖాన్ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ లాక్‌డౌన్‌ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. లాక్‌డౌన్‌లో పేదలకి సాయం చేసిన సల్మాన్, ఇప్పుడు హీరోయిన్ చెల్లెలిని ప్రమోట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ హీరోయిన్‌ని ఫ్యామిలీలో కలిపేసుకున్న సల్మాన్, ఇప్పుడామె చెల్లెలిని కూడా ఖాన్స్ కాందాన్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాడు.

బాలీవుడ్‌లో హీరోయిన్స్‌ని ఎంకరేజ్ చెయ్యడంలో ముందుంటాడు సల్మాన్ ఖాన్. కెరీర్‌లో ఎంతమంది హీరోయిన్స్‌కి పుషప్‌ ఇచ్చిన సల్మాన్ ఇప్పుడు కత్రీనా కైఫ్ చెల్లెలు ఇసబెల్లా కైఫ్‌కి కూడా సపోర్ట్‌ చేస్తున్నాడు. ఇసబెల్లా, పుల్కిత్ సామ్రాట్ కాంబోలో వస్తోన్న ‘సుస్వాగతం ఖుషామ్‌దీద్’ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు సల్మాన్.

కత్రీనా కైఫ్‌ కెరీర్‌ కొంచెం డల్‌ ఫేజ్‌లో ఉన్నప్పుడు సల్మాన్‌ ఖాన్ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాడు. కత్రీనాకి యాక్టింగ్‌ రాదనే విమర్శలని కూడా పట్టించుకోకుండా సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్ ఉందన కామెంట్స్‌ వచ్చినా వీటిని పట్టించుకోకుండా సల్మాన్ ఫ్యామిలీకి దగ్గరైంది కత్రీన.

సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగే ప్రతీ ఈవెంట్‌కి అటెండ్‌ అవుతుంది కత్రీనా కైఫ్. ఇక సల్మాన్ కాందాన్‌ కూడా ఫ్యామిలీ మెంబర్‌లాగే ట్రీట్‌ చేస్తుంది. ఈ రిలేషన్‌తోనే కత్రీనా కైఫ్ చెల్లెలు ఇసబెల్లా కైఫ్‌ని కూడా సపోర్ట్ చేస్తున్నాడట సల్మాన్. ఇక ఇసబెల్లా కూడా ఇప్పటికే మరో రెండు సినిమాలకి సైన్ చేసింది. అక్కలాగే స్టార్‌ రేస్‌కి దగ్గరవుతోంది. ఇక చెల్లెలికి వస్తోన్న సపోర్ట్ చూసి కత్రీన కూడా హ్యాపీగా ఫీలవుతోందట.

 

 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....