తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. అబ్బాయిలదే హవా..!

-

ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన రవిశ్రీతేజకు వచ్చింది. 95.48 శాతం మార్కులు వచ్చాయి. సెకండ్ ర్యాంక్ చంద్రశేఖర్ 94.65(హైదరాబాద్), థర్డ్ ర్యాంక్ ఆకాశ్ రెడ్డి 93.16 (హైదరాబాద్), ఫోర్త్ ర్యాంక్ కార్తీకేయ (హైదరాబాద్) కు వచ్చాయి.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్ కోసం లక్షా 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 68 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే ఎంసెట్ లో టాప్ ర్యాంకులను అబ్బాయిలే సాధించడం విశేషం.

ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన రవిశ్రీతేజకు వచ్చింది. 95.48 శాతం మార్కులు వచ్చాయి. సెకండ్ ర్యాంక్ చంద్రశేఖర్ 94.65(హైదరాబాద్), థర్డ్ ర్యాంక్ ఆకాశ్ రెడ్డి 93.16 (హైదరాబాద్), ఫోర్త్ ర్యాంక్ కార్తీకేయ 93.03 (హైదరాబాద్), ఐదో ర్యాంకు భానుదత్త 92.05, ఆరో ర్యాంకు సాయివంశీ 91.76, ఏడో ర్యాంకు సాయి విజ్ఞ 91.47, ఎనిమిదో ర్యాంకు కశ్యప్ 91.79, తొమ్మిదో ర్యాంకు వేద ప్రణవ్ 90.60, పదో ర్యాంకు అభిజిత్ రెడ్డికి వచ్చాయి. ఎంసెట్ ఫలితాలను www.ntnews.com వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఫార్మసీలో ఫస్ట్ ర్యాంక్ ఎంపటి కుశ్వంత్ (భూపాలపల్లి), రెండో ర్యాంక్ దాసరి కిరణ్, మూడో ర్యాంక్ అరుణ్ తేజ, నాలుగో ర్యాంకు సాయిస్వాతి, ఐదో ర్యాంక్ అక్షయ్(హైదరాబాద్) వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version