వామ్మో… సల్మాన్ ఫీజు మరి ఇంతనా …?

-

ఎక్కడో విదేశాల్లో మొదలైన బిగ్ బాస్ రియాల్టీ షో మన భారత దేశాన్ని కూడా చేరి అటు హిందీలో, ఇటు తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో సూపర్ హిట్ అయింది. ఇకపోతే తెలుగులో కేవలం మూడు సీజన్లు ముగిసి నాలుగో సీజన్ కు రంగం సిద్ధం చేస్తోంది. ఇకపోతే బాలీవుడ్లో మాత్రం 13 సీజన్లు పూర్తి చేసుకుని 14వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. 14వ సీజన్ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలైపోయాయి కూడా. బిగ్ బాస్ షో బాలీవుడ్లో మొదలైనప్పటి నుండి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ విదితమే. అయితే సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్ ను అంతకంతకూ పెంచుతూ వెళ్తున్నాడు.

salman
salman

ఇక 14వ సీజన్ కు అతను తీసుకుపోయే రెమ్యునరేషన్ వింటే మీరు షాక్ అవుతారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 14 సీజన్ కు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ. 16 కోట్ల రూపాయలను తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే లెక్కలో ప్రతివారం శని, ఆదివారాలు లెక్కవేస్తే సీజన్ ముగిసేసరికి 100 రోజుల్లో ఏకంగా సల్మాన్ ఖాన్ రూ. 450 కోట్ల నుండి రూ. 500 కోట్ల వరకు సంపాదించబోతున్నారు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ రాధే, కభీ ఈద్ కభీ దీవాళి అనే ఈ సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news