గాడ్ ఫాదర్​లో రామ్​చరణ్​… క్లారిటీ ఇచ్చిన సల్మాన్

-

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్’. ఇందులో చిరు తనయుడు, నటుడు రామ్‌చరణ్‌ అతిథి పాత్రలో కనిపిస్తారంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ విషయమై స్పందించారు.

శనివారం నిర్వహించిన ‘గాడ్‌ ఫాదర్‌ ట్రైలర్‌ విడుదల’ కార్యక్రమంలో ఆయన స్పష్టతనిచ్చారు. ‘గాడ్‌ ఫాదర్‌’లో రామ్‌ చరణ్‌ అతిథి పాత్ర పోషించారని, తెరపై చూసేందుకు తామూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ‘‘ఒకే ఫ్రేమ్‌లో మీతో కలిసి నటించాలని ఉందని రామ్‌ చరణ్‌ ఓ రోజు తన మనసులో మాట బయటపెట్డాడు. అతను జోక్‌ చేస్తున్నాడేమో అనుకుని, దీని గురించి రేపు మాట్లాడదాం అని చెప్పా. మరుసటి రోజు.. చరణ్‌ తన క్యాస్ట్యూమ్స్‌ తీసుకుని సెట్‌కి వచ్చేశాడు’’ అని సల్మాన్‌ ఖాన్‌ తెలిపారు.

రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘మగధీర’, ‘బ్రూస్‌ లీ’ చిత్రాల్లో చిరంజీవి అతిథిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వచ్చిన ‘ఆచార్య’లో ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషించారు. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ‘గాడ్‌ ఫాదర్‌’ అక్టోబరు 5న విడుదలకానుంది. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమాకి రామ్‌ చరణ్‌ నిర్మాతగానూ వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news