చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్.. అదే నిజమైతే..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన సినిమాల లైనప్ తో మెగా ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలో నటిస్తున్న చరణ్ ఆ సినిమాల తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా ఫైనల్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ డైరక్షన్ లో పాన్ ఇండియా మూవీలో చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

Salman Khan in Shankar Ram Charan Combo movie

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తాడని వార్తలు రాగా.. వాటిల్లో నిజం లేదని తెలుస్తుంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని అంటున్నారు. చరణ్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడని టాక్. అదే నిజమైతే మాత్రం ఇది బాలీవుడ్, టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ అవుతుంది. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ లో సైఫ్ ఆలి ఖాన్ నటిస్తుండగా డైరెక్ట్ సౌత్ సినిమాకు సల్మాన్ సైన్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉండటం నిజమైతే మాత్రం ఆ సినిమాకు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.