స‌మంత అందానికి కార‌ణ‌మిదేన‌ట‌..!

-

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న అక్కినేని కోడలు స‌మంత పెళ్ల‌య్యాక కూడా త‌న అందం ఏమాత్రం వ‌న్నె త‌గ్గ‌కుండా అలాగే మెయింటైన్ చేస్తూ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. ఈ యేడాది ఇప్ప‌టికే భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలీ సినిమా చేసి సూప‌ర్ హిట్ కొట్టిన స‌మంత‌… ఆ త‌ర్వాత ఓ బేబీ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంది.

పెళ్ల‌యినా కూడా స‌మంత వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే స‌మంత త‌న ఫిట్‌నెస్‌కు ఎంతో ప్ర‌యార్టీ ఇస్తూ ఉంటుంది. ప్ర‌తి సినిమాను త‌న తొలి సినిమాలాగానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంత‌కు ఆమె ఫిట్‌నెస్ ర‌హ‌స్యం ఏంటో ఆమె బ‌య‌ట పెట్టేసింది. ఆ సీక్రెట్ అంతా ఆమె బ్యాగ్‌లోనే దాచుకుంద‌ట‌.

ఎన్ని ప‌నులున్నా… ఎంత బిజీగా ఉన్నా స‌మంత జిమ్‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ట‌. ఇక మార్ష‌ల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆమె ఏ సింబ‌ల్ అయినా అవ‌లీల‌గా చేసేస్తుంద‌ట‌. సినిమా షెడ్యూల్స్ లేక‌పోతే ఎక్కువుగా జిమ్‌లోనే గ‌డిపే స‌మంత‌… తిండి విష‌యంలో మాత్రం చాలా ప్లానింగ్‌తో ఉంటుంద‌ట‌.

అన్నం, సాంబార్‌, చికెన్‌, ఫిష్‌, స్వీట్‌ పొంగల్‌తో పాటు ఫిల్టర్‌ కాఫీ, ప్రోటీన్లు ఎక్కువ ఉండే ఆహారం, అధిక నీరు, తాజా కూరగాయలు, కొబ్బరి నీరు డైట్‌లో ఉండేలా చూసుకుంటారు. వీటితో పాటు ఆమె బ్యాగ్‌లోనే ఆమె అందానికి సంబంధించిన కిట్ ఉంద‌ట‌. సో ఇదే త‌న ఫిట్‌నెస్ సీక్రెట్ అని చెపుతోంది స‌మంత‌.

Read more RELATED
Recommended to you

Latest news