Samantha: ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ చేసిన సమంత..త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘శాకుంతలం’. ప్రకృతి ప్రియం ‘శాకుంతలం’ సినిమాపైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టైటిల్ రోల్ ‘శకుంతల’ను సమంత ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ నటించారు. ఈ పిక్చర్ ద్వారా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నది.

ఈ చిత్ర అప్ డేట్స్ కోసం చాలా కాలంగా సినీ అభిమానులు ఎదురు చూస్తుండగా, తాజాగా సమంత అప్ డేట్ ఇచ్చేసింది. సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా, ఆదివారం డబ్బింగ్ కంప్లీట్ అయినట్లు సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపింది. అలా ‘శాకుంతలం’ సినిమా పూర్తి షూట్ కంప్లీట్ అయినట్లు స్పష్టమైంది.

ఈ పాన్ ఇండియా సినిమాను గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రం తర్వాత సమంత మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయనుంది. ‘యశోద’ అనే సినిమా చేయనుంది. ఇది కూడ పాన్ ఇండియా సినిమాగా రాబోతున్నది.

సమంత బాలీవుడ్ ఫిల్మ్స్ పైన కూడా కాన్సంట్రేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన తొలి హాలీవుడ్ ఫిల్మ్ షూట్ లోనూ త్వరలో పాల్గొనే అవకాశాలున్నాయి. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత.. సమంత తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news