నాగచైతన్య – సమంత వివాహం జరిగి ఈ నెల7తో మూడేళ్లు పూర్తయ్యాయి. ఇటీవలే మూడవ యానివర్సనీని జరుపుకున్నారు. వీరి పిల్లల గురించి తరచూ చర్చ జరుగుతూనే వుంది. అదే చర్చ సామ్, చై మధ్య జరిగితే.. ఇంట్రెస్టింగ్ వుంటుంది కదా .. అదే పాయింట్‌తో మింత్రా బ్రాండింగ్ ఓ ప్రమోషనల్ యాడ్ ఫిల్మ్‌ని రూపొందించింది. మింత్రాకి సమంత బ్రాండ్ అబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ యాడ్ లోకి నాగచైతన్య కూడా వచ్చేశారు. భార్య సమంతతో కలిసి తను కూడా మింత్రా బ్రాండ్‌లకి ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ కమర్షియల్ వీడియోని వదిలారు. `మీరు రిలాక్స్ అవ్వండి.. అందరికి పండగ షాపింగ్ నేనే చేస్తా అంటుంది సమంత.. డోంట్ వర్రీ బేబీ షాపింగ్ నేనే చేస్తున్నా.. టాప్ బ్రాండ్స్ అన్నీ మింత్రాలో వున్నాయి. నాన్న, అమ్మ .. తమ్ముడికి కూడా సరిపోయేలా ఎన్నో కూల్ బ్రాండ్స్ వున్నాయి.
అమ్మ కు ఈ కలర్ బాగుంటుంది కదూ అని చైతన్య సంభాషణ కొనసాగుతుండగా మధ్యలో సమంత కలగజేసుకుని పిల్లల విభాగాన్నితనిఖీ చేస్తుంది. అమ్మాయిల డ్రెస్‌లు చూపిస్తూ బాగున్నాయి కదా అని అడిగితే ఇప్పుడు దాని గురించి ఇటువంటి ఆలోచనలు రాకూడదని నాగచైతన్య చెప్పడం.. సామ్ మరీ మరీ కావాలని సైగ చేయడం వీవర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఈ యాడ్ ఫిల్మ్ వీడియోని నాగచైతన్య సోషల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేశారు. సమంత పిల్లలు కావాలని అడుగుతున్న సీన్ గురించి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎంత క్యూట్‌గా అడుగుతున్నారు మేడమ్ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.
https://www.instagram.com/p/CG2HgQFJsHk/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again