‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ పాట ఏ రేంజ్లో పాపులారిటీ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ టూ బాలీవుడ్.. ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఈ పాట ఓ ఊపు ఊపేసింది. ఇక ఈ పాటతో సమంత రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సెలబ్రిటీల నుంచి సినీ ప్రేమికుల వరకూ ఈ పాటకు ఫిదా అయ్యారు. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకు తాజాగా సమంత మరో సారి స్టెప్పులేసింది.
‘సిటడెల్’ (ఇండియన్ వెర్షన్) షూట్ కోసం సెర్బియా వెళ్లిన ఆమె.. ఓ క్లబ్‌లో సరదాగా స్టెప్పులు వేశారు. అక్కడే ఉన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఆమెను డ్యాన్స్ చేయమంటూ ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. ‘పాట వచ్చి రెండేళ్లు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘సిటడెల్’ టీమ్.. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల సెర్బియా వెళ్లింది. బెల్గ్రేడ్‌లో షూట్ పూర్తైన వెంటనే టీమ్ మొత్తం కలిసి ఓ క్లబ్‌కు వెళ్లి సరదాగా గడిపారు. ఈ సమయంలోనే క్లబ్‌లో ‘ఊ అంటావా మావా’ పాటను ప్లే చేయగా సామ్ డ్యాన్స్ చేశారు.
Overwhelmed beyond words🔥🥳#OoAntava craze in #Serbia is next level!!
Sam 🔥🧿💗@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Samantha #Pushpa #AlluArjun pic.twitter.com/eQrVL4Mny8— RoshSam💌 (@RoshSamLover) June 10, 2023