స‌మంత హాట్ యోగా వీడియో వైర‌ల్‌!

స్టార్ హీరోయిన్ అక్కినేని స‌మంత ఫిట్‌నెస్ గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యం నుంచి ఇంటి ప‌ట్టునే వుంటున్న స‌మంత వ‌ర్క‌వుట్‌లు చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. సినిమాల్ని చాలా వ‌ర‌కు త‌గ్గించుకున్న సామ్ నిత్యం ఏదో ఒక కొత్త‌ది చేయాల‌ని త‌పిస్తూ వుంటుంది.

డాబాపై వ్య‌వ‌సాయం అంటూ ఇంటి మేడ‌పై వెజిటెబుల్స్ పండించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన స‌మంత ఇటీవ‌ల సాకి పేరుతో సొంత బ్రాండ్‌ని లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. పూర్తిగా శాఖాహారిగా మారిపోయిన స‌మంత చ‌క్క‌ని డైట్‌ని పాటిస్తూ వ‌ర్క‌వుట్‌లు చేస్తోంది. డైట్ యోగా అంటూ స‌మంత తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

`ప్రతిచోటా అన్ని జీవుల‌ను సంతోషంగా … స్వేచ్ఛగా ఉండనివ్వండి.. నా వ్య‌క్తిగ‌త జీవితంలోని ఆలోచనలు, మాటలు .. చర్యలు ఆ ఆనందానికి .. అందరి స్వేచ్ఛకు ఒక విధంగా దోహదం చేస్తాయి. శాఖాహారం తీసుకునేవారు వారి పనితీరును పెంచుకోలేరనే అపోహను బద్దలు కొట్టడం.. మొక్కల ఆధారిత ఆహారం మీద సన్నని కండరాలను నిర్మించడం …వంటివి చేయాల‌న్న ప్ర‌య‌త్న‌మిది` అని స‌మంత పేర్కొంది.