దీపావ‌ళికి స‌మంత సర్‌ప్రైజ్ రెడీ!

-

స‌మంత ఈ దీపావ‌ళికి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతోంది. లాక్‌డౌన్ నుంచి వ‌రుస స‌ర్‌ప్రైజ్‌ల‌తో అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సామ్ మ‌రో సారి బిగ్ స‌ర్‌ప్రైజ్‌ని ఈ దిపావాళి ఫెస్టివెల్‌కి రెడీ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల డాబా టెర్రాస్‌పై వ్య‌వ‌సాయం మొద‌లుపెట్టిన స‌మంత సాకి పేరుతో క్లాతింగ్ బిజినెస్‌ని కూడా ప్రారంభించేసింది. ఈ ఏడాదే స‌మంత డిజిల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే.

మ‌నోజ్ బాజ్‌పాయ్, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `ఫ్యామిలీమేన్‌` వెబ్ సిరీస్ ఆక‌ట్టుకోవ‌డంతో దీనికి కొన‌సాగింపుగా `ఫ్యామిలీమేన్ 2` రాజ్ ఎన్ డీకే రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌తో స‌మంత డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఇటీవ‌లే త‌న క్యారెక్ట‌ర్‌కు డ‌బ్బింగ్ చెప్పుకుంది స‌మంత‌. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన ఈ వెబ్ సిరీస్‌ దీపావ‌ళికి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిసింది. ఇందులో స‌మంత పాకిస్తానీ టెర్ర‌రిస్టుగా క‌నిపించ‌నుండ‌టంతో ఈ వెబ్ సిరీస్ కోసం స‌మంత ఫ్యాన్స్ చాలా ఎక్సైట్‌మెంట్‌లోతో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news