టాలీవుడ్ బెస్ట్ కోడలు సమంత.. ఉపాసన ట్వీట్..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎడిటర్ గా వ్యవహరిస్తున్న బీ పాజిటివ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేగజైన్ కు ఏపిల్ కవర్ పేజ్ గా సమంత ఫోటో షూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంతను ఉపాసన ఇంటర్వ్యూ చేయడం జరిగిందట. ఫిట్ నెస్ విశేషాలతో పాటుగా ఎన్నో విషయాలను సమంత ఉపాసనతో షేర్ చేసుకుందని తెలుస్తుంది. ఈ సందర్భంగా జరిగిన ఫోటో షూట్ ఫోటోలను ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేశారు.

స్వీటెస్ట్.. శక్తివంతమైన సమంత.. టాలీవుడ్ బెస్ట్ కోడలు అవార్డ్ ఆమెకే అంటూ ఉపాసన ట్వీట్ చేయడం విశేషం. ఇదవరకు ఈ మేగజైన్ కు హృతిక్‌ రోషన్‌, ఐశ్వర్యరాయ్‌, కత్రినా కైఫ్‌, రామ్‌ చరణ్‌, షాహిద్‌ కపూర్‌, ఆలియా భట్‌, కృతి సనన్‌ వంటి సెలబ్రిటీస్ కవర్ పేజ్ కు స్టిల్స్ ఇచ్చారు. సౌత్ నుండి సమంతకే ఆ లక్కీ ఛాన్స్ దక్కింది. హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న సమంత పెళ్లి తర్వాత మరిన్ని అవకాశాలను అందుకుంటుంది. అంతేకాదు ఫిట్ నెస్ లో కూడా ఆమె ది బెస్ట్ అనిపించుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news