ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, ప్రధాన పార్టీల నేతలు కొట్టుకోవడం.. అంటి ఘటనలు మినహా ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే… కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం చౌటపల్లిలోని 172, 173 బూత్ లతో తీవ్రంగా గందరగోళం నెలకొన్నది. అక్కడ ఓటర్లు ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి ఓట్లు పడుతున్నాయి.
టీడీపీ ఓటేస్తే వైసీపీ పడుతున్నట్లు ఓటర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఓటర్లు వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే పోలింగ్ ను నిలిపేశారు. వెంటనే ఆ ఈవీఎంలను తీసేసి కొత్త ఈవీఎంలతో మళ్లీ పోలింగ్ ను నిర్వహించారు.
విజయవాడలోనూ అలాగే..
విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్ లో ఉన్న పోలింగ్ బూత్ లో కూడా అదే పరిస్థితి ఉంది. సైకిల్ గుర్తుకు ఓటేస్తే బీజేపీకి పడుతున్నదట. ఓటర్లు ఈ విషయాన్ని వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయగా… అధికారులు పోలింగ్ ను నిలిపేశారు.