`సామ్ జామ్‌`కు సామ్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

అల్లు అర‌వింద్ మైహోమ్ గ్రూప్ వారితో క‌లిసి నిర్వ‌హిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. లాక్‌డౌన్ కి ముందు హ‌డావిడీగా ప్రారంభ‌మైన ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. కార‌ణం కావాల్సిన కంటెంట్ లేక‌పోవ‌డమే. దీంతో వెంట‌నే తేరుకున్న అల్లు అర‌వింద్ రంగంలోకి దిగి కావాల్సినంత కంటెంట్‌లో ఆహాని నింప‌డం మొద‌లుపెట్టారు.

సినిమాల‌తో అత్య‌ధికంగా నిండిపోయిన ఆహాకి మ‌రింత క‌ల‌ర్‌ని యాడ్‌చేసేందుకు పెద్ద‌ప్లాన్ వేశారు. ఇందు కోసం స్టార్ హీరోయిన్ స‌మంత‌ని రంగంలోకి దింపారు. ఆమెతో `సామ్ జామ్‌` పేరుతో రియాలిటీ షోని మొద‌లుపెట్టారు. ఈ నెల 13న ఫ‌స్ట్ ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేశారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొన్నాడు. కానీ క్రేజ్ రాలేదు. మొత్తం 10 ఎపిసోడ్‌ల‌ని సిద్ధం చేశార‌ట‌.

దీని కోసం స‌మంత‌కు కోటిన్న‌ర పారితోషికం ఇచ్చార‌ని తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్‌తో చేస్తున్న షో అని ప్ర‌చారం చేసినా `బ‌తుకు జ‌ట్కా బండి..అలీతో స‌ర‌దాగా, సుమ క్యాష్ వంటి షోల‌కు కాపీగా క‌నిపించింది. దీంతో ఈ షోకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రావ‌డం లేదని ప్ర‌చారం జ‌రుగుతోంది.