రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత ఖుషి సినిమాలోని పాట చిత్రీకరణలో భాగంగా తుర్కియోలో ఆడిపాడుతున్నారు. చిత్రీకరణ సమయంలో విరామం దొరకడంతో ఇద్దరు కలిసి లంచ్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోను సమంత షేర్ చేశారు.
“నీ ఉన్నత స్థాయిని చూసా… ఎత్తు పల్లాలను చూశా…ఎటువంటి పరిస్థితుల్లోనైనా కొందరు స్నేహితులు మనతోనే ఉంటారు” అని విజయ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. కాగా, విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కావాల్సింది. కాని లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వం లో ,సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమా చేస్తున్నాడు.