కేంద్ర ప్రభుత్వం ఎన్నోరకాల స్కీములని అందిస్తోంది. దానితో పాటుగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అని పిల్లల కోసం అని ప్రత్యేక పథకాలను కూడా తీసుకు వస్తోంది. ఈరోజుల్లో సోషల్ మీడియాలో చాలా నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి ఇలాంటి నకిలీ వార్తల వలన చాలామంది మోసపోతున్నారు ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం కూడా కష్టం అవుతోంది.
చాలామంది నకిలీ వార్తలని నిజం అని నమ్ముతున్నారు దాంతో మోసపోవాల్సి వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… గత కొన్ని రోజులుగా NITI GYAN 4 U అనే యూట్యూబ్ ఛానెల్ ప్రభుత్వ పథకం గురించి చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘శ్రామిక్ సమ్మాన్ యోజన’ స్కీమ్ ని మొదలు పెట్టిందని, దీని ద్వారా మహిళలు ప్రతినెల రూ.5,100 పొందవచ్చని అందులో చెప్పడం జరిగింది.
మరి ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది. NITI GYAN 4 U అనే యూట్యూబ్ ఛానెల్ ‘శ్రామిక్ సమ్మాన్ యోజన’ స్కీమ్ ని మొదలు పెట్టిందని, దీని ద్వారా మహిళలు ప్రతినెల రూ.5,100 పొందవచ్చని చెబుతున్న దానిలో నిజమే లేదు.