హాట్ టాపిక్ గా సమంత విడాకుల “భరణం”!

-

చైతన్య – సమంత తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్‌ స్టాఫ్‌ పెట్టబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడిచిన సంగతి తెలిసిందే! అయితే ఆ హాట్‌ టాపిక్‌‌‌ కు శనివారం నాడు ఫుల్‌ స్టాప్ పడింది. సోషల్ మీడియా ప్రచారాన్నే ఫైనల్ చేస్తూ.. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య… సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసేశారు. సమంత కూడా ఇదే విషయాన్ని పోస్ట్‌ చేశారు. అయితే ఇప్పుదు “సమంత భరణం” సోషల్ మీడియాను షేక్ చేస్తుంది!

అవును… నాగచైతన్య, సమంత విడాకులతో పాటు “భరణం” టాపిక్ తెరపైకి వచ్చింది. గాసిప్ రాయళ్లు ఇప్పుడు సమంతకు అన్నినేని వారు ఎంత భరణం ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని వైరల్ చేస్తున్నారు! అయితే… ఇటు నాన్న తరుపున అక్కినేని, అటు అమ్మ తరుపున దగ్గుబాటి కుటుంబాల నుంచి చైతన్యకు వారసత్వంగా ఆస్తి వచ్చింది. ఇదేసమయంలో ఒక్కో సినిమాకూ చైతూ పారితోషికం కోట్లలో తీసుకుంటున్నారు! ఈ నేపథ్యంలో సమంతకు సుమారుగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు భరణంగా వస్తుందనేది గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతుంది!

విడాకుల విషయంలో విచారం వ్యక్తం చేసిన నాగార్జున కూడా భరణం ఇవ్వాలనే ఆలోచనలోనే ఉన్నారనేది మరోగాసిప్. అయితే…  సమంత మాత్రం అందుకు అంగీకరించడం లేదంట! అవును… అక్కినేని ఫ్యామిలీ భరణాన్ని ఇవ్వడానికి సిద్ధమైనా.. సమంత మాత్రం తీసుకోవడానికి నిరాకరించినట్లు ప్రచారం జరుగుతుంది!

కాగా.. గతంలో సెలబ్రిటీ కపుల్స్‌ ఎందరో విడాకులు తీసుకున్నప్పటికీ… భరణం టాపిక్ మాత్రం ఇప్పటివరకూ బయటకు వచ్చిన దాఖలాలు లేవు! రేణూ దేశాయ్‌ అయితే.. తానేమీ తీసుకోలేదు – పవన్ నే అడగండి అంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు! సో… చైతన్య, సమంతల వ్యవహారం కూడా బయటకు అఫీషియల్ గా రాకపోవచ్చనే అనుకోవాలి!

Read more RELATED
Recommended to you

Latest news