సినీ ఇండస్త్రీపై కోడాలి నాని సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్ల రగడ ఇంకా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ వైసీపీ, జనసేన పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చెలరేగాయి. తాజాగా వైసీపీ నేత, మంత్రి కోడాలినాని  సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై విమర్శలు చేసిన వారిపై ఫైర్ అయ్యారు. నలుగురు నిర్మాతలు, నలుగురు హీరోలను ద్రుష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిర్ణయాలు తీసుకోదని, అందరి సంక్షేమం పరిగనలోకి తీసుకుంటుుందని వ్యాఖ్యానించారు.

అందరి ప్రయోజనాలు పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుతామంటే చూస్తూ ఊరుకోం అని అన్నారు. పవన్ కళ్యాణ్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని కోడాలి నాని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదని, జీవిత కాలంలో జగన్ మోహన్ రెడ్డిని ఎవ్వరూ భయపెట్టలేరని అన్నారు. ఆయనకు ప్రజల సపోర్ట్ ఉందని పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు.